ఉనకోటిని కోటి దేవతల కొండ అని పిలుస్తారు . త్రిపుర రాష్ట్రం లోని అగర్తలకు దగ్గరగా ఉన్నాయి. ఈ ఉనకోటి పర్వతాలు . ఈ కొండలమీద దేవతలున్నారు . ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది . కోటిమంది దేవతలు ఈ కొండపైకి ఎలా వచ్చారో ఇక్కడ పురాణ గథా చెపుతోంది . శివుడు కోటిమంది దేవతలను వెంట చెట్టుకొని కాశీ బయలుదేరాడు . చీకటి పడగానే అందరూ విశ్రాంతి తీసుకొన్నారు . సూర్యోదయానికి లేవాలని చెప్పాడట శివుడు కానీ ఆయన నిద్ర లేచేసరికి ఎవళ్ళు నిద్ర లేవలేదని కోపం వచ్చి అందరిని శిలలై పొమ్మన్నాడట .అందరు ఆలా శిలలై పోయారు . ఆ పురాణగాథ ప్రకారం ఈ కొండలకు ఉనకోటి అనే పేరు పెట్టారు . అంటే ఒకటి తక్కువ కోటి . ఆ ఒక్క దైవం త్రినేత్రుడు శివుడు .

Leave a comment