ఖరీదైన పరదాల తోనే ఇంటికి అందం వస్తుంది. డోర్ కర్టన్ల్ గా పార్టిషన్ గా వాడే ఇవి రెగ్యులర్ గా దులిపి బాగా చేయాలి. నెలకోసారి ఉతికితే కొత్తవిగా కనిపిస్తాయి. ముదురు రంగు పరదాలు ఉతికి ఎండలో వేస్తే షేడ్ అవుతాయి. డ్రై క్లీనింగ్ కు ఇవ్వటం బెస్ట్… లేదా ఇంట్లో ఉతికితే జాగ్రత్తగా పిండకుండా ఆరేసి,కాస్త తడిపోగానే ఇస్త్రీ చేయాలి. ఇస్త్రీ లేకపోతె ఉతికిన పరదాలు ముడతలు పడి బావుండవు. అలాగే రకరకాల రంగుల పరదాలు ఒకే సారి తడిపి ఉతికితే ఒక దాని రంగులు ఇంకోదానికి అంటుకుంటాయి రంగులు పూలు డిజైన్లు పరదాలు విడివిడిగా ఉతికి పిండకుండా నీడన ఆరేసి తడి ఆరి పోకుండా ఇస్త్రీ చేస్తే ఎక్కువ కాలం కొత్తవిగా ఉంటాయి.

Leave a comment