పింక్ తర్వాత తాప్సీ  కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ  మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా బాధ్యత ను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ గుర్తింపు కాపాడుకోవాలనుకుంటున్నాను .  గతంలో లాగా కధ ఎలా వున్నా న అపాత్ర గురించి కూడా కనీసం ఆలోచించకుండా వప్పుకునే దాన్ని ఇక ఇప్పుడు కధలు వింటున్నా. నా పాత్ర ఎలా ఉంటుందో చూసుకోవటం నేర్చుకుంటున్నా అంటోంది తాప్సీ . సినిమాలో ఇష్టం కొద్దీ వచ్చాను. మోడలింగ్ లో పేరు వచ్చాకే సినిమా అవకాశాలు వచ్చాయి. మొదట్లో నా పేరెంట్స్ చాలా టెన్షన్ పడే వాళ్ళు . మంచి పేరు తెచుకున్నాక వాళ్ళప్పుడు హ్యాపీగా వున్నారు. అని చెపుతోంది తాప్సీ . ఆమె వెడ్డింగ్ ప్లానార్ బిజినెస్ గురించి మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంది.నా ఫ్రెండ్స్ మా సిస్టర్ కలిసి బిజినెస్ చూస్తున్నారు. ఇప్పుఇప్పుడే పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. షూటింగ్ అయిపోగానే వెంటనే ఆఫిస్ కు వెళ్ళిపోయి వాళ్ళతోబిజినెస్ విషయాలు షేర్ చేసుకుంటా. ఇప్పటివరకు బిజినెస్ బావుంది అంటోందీ ఢిల్లీ అమ్మాయి. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని దీవించినవాళ్ళే ఇప్పుడు ఫలానా క్యారెక్టర్ కు తాప్సీ నీ తప్ప ఇంకో ఆప్షన్ లేదంటున్నారు. ఈ సంవత్సరం తాప్సీ కి కలసివచ్చినట్లే.

Leave a comment