ఫ్యాషన్ స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తుంటాయి వాటిలో మునివేళ్ళ పై అందాలు దిద్దు చోటు ఒకటి నెయిల్ ఆర్ట్ రకరకాల హంగులలో ఫ్యాషన్ పోకడగా నిలిచింది ఫ్రెంచ్ మనిక్యూర్, బ్లాక్ టిప్స్ నుంచి గ్లిట్టర్ పెయింట్స్ దాకా ట్రెండి నెయిల్ స్టైల్స్ రంగం పైకి వచ్చాయి. కానీ ఈ నెయిల్ ఆర్ట్ ని కాస్త క్రియేటివ్ గా ఆలోచించాలి. ఒక్క గోటికి జిగ్ జాగ్ మనే వెండి మెరుపులు వేసి మిగతా గోళ్ళని డార్క్ రెడ్ లేదా ఒక్క గోటిని ఒక్క కలర్ డిజైన్ లో నింపేయడం లేటెస్ట్ ట్రెండ్ నిండు నీలమ్, టర్నోయిన్, పసుపు, నియాన్ గ్రీన్, బ్లాక్ మాత్రమే ట్రెండి కాదు ఈ గోళ్ళను దుస్తులతో కాంట్రస్ట్ గా లేదా పూర్తి మాచింగ్ టీమ్ గా వేసుకోవాలి. దుస్తులు, వేలి కొసలు ఒక దానికి ఒకటి ధీటుగా వుండాలి.

 

Leave a comment