జీవన శైలి, పని విధానాన్ని బట్టే శిరోజాల కటింగ్, స్టయిలింగ్ ఎంచుకోవాలి. ఇదే సమయంలో ముఖాకృతిని దృష్టిలో ఉంచుకుని హెయిర్ స్టయిలిస్ట్ సలహా వినాలి. గుండ్రని ముఖం గల వాళ్ళకి బాబ్ బాగుంటుంది. ఓవెల్ ముఖాకృతి అయితే ఎటువంటి కటింగ్ అయినా నప్పుతుంది. అలాగే నలభై ఏళ్ళు దాటితే క్లాసిక్ లుక్స్ బాగుంటుంది. ఈ వయస్సులో బుజాల దాకా వుండే విస్సి లేయర్స్ నప్పుతాయి. ఈ లేయర్స్ ఒక దాని’ వెంట ఒకటి క్లోజ్ లెంగ్త్ లో వుండాలి. అలాగే పల్చని జుట్టు అయితే నడి నెత్తి పైన వాల్యుమైజ్ చేసే కట్ అసలు బాగుండదు అలాగే పొడవుగా వుండే వాళ్ళకు సూట్ అయ్యే క్లాసిక్ లెంగ్త్ జుట్టు మొత్తం వెనక్కి లాగి టైట్ గా పోనీ టేయిల్ బిగించి కడితే చాలా బాగుంటుంది. స్టయిలింగ్ విషయం స్వయం నిర్ణయం కంటే హెయిర్ స్టైలిస్ట్ సలహా స్వీకరించడం మంచిది.

Leave a comment