హామ్ బడ్జెట్ సింక్ లైట్ యాప్ కనుక డౌన్ లోడ్ చేసుకుంటే ఆదాయం, ఖర్చులు, బిల్లులు, ఇవన్నీ సరిచుసుకోవచ్చు.  ఈ యాప్ తో ఇంట్లో వుండే సభ్యులందరికీ ఖాతాలు ఫీడ్ చేసి ఎవరెవరు ఎంత ఖర్చుపెట్టారన్న విషయం తెలుసుకోవచ్చు.  అంటే ఇదో జమా ఖర్చుల వివరాలు పుస్తకం లాంటిది. ఏ తేదీల ప్రకారం ఏవో బిల్లులు కట్టాలో నమోదు చేసుకోవచ్చు అప్పుడు ఈ యాప్ ముందుగా మనం ఫీడ్ చేసినా ఆదాయానికి సంబందించిన బోర్డును చూపెడుతూ, చేస్తున్న ఖర్చులు, బిల్లులు అన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా ఇప్పటి వరకు చేస్తున్న ఖర్చులు పెరిగాయా తగ్గాయా అని ప్రతి వారం సరిచుసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇంట్లో వున్న దారాల కుటుంబ సభ్యులందరూ ఎదో ఒక సంపాదనా మార్గంలోనే వున్నాయి భార్యా భర్తలు ఇద్దరూ జాబ్స్ లో ఉంటున్నారు. ఎంతో బిజీగా వుంటున్నారు కనుక జమా ఖర్చులు, కట్టవలసిన బిల్స్ మరచి పోతు వుంటారు. ఈ యాప్ తో సమస్యలుండవు.

Leave a comment