దీంతో మన చిన్న బాల్కనీలో చిన్నపాటి స్థలంలో కూరగాయలు ఆకుకూరలు పెంచాలనుకొంటే, గ్రో యువర్ సెల్ఫ్ కిట్ కోసం అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే చాలు ఒక కిట్ ఇంటి వాకిట్లో ఉంటుంది. విత్తనాలు కుండీలు సేంద్రియ ఎరువు మట్టి ఎలా పెంచాలో ఒక బుక్ లెట్ మొక్క ఎదుగుదల గురించి నోట్ చేసుకునే చిన్న నోట్ బుక్ సమస్తం కిట్ లో ఉంటాయి. కిట్ లో పచ్చని సేంద్రీయ ఎరువులే కనుక రసాయనాల భయం లేకుండా చక్కని ఇంటి పంట ను ప్రతిరోజు కోసుకోవచ్చు. మొక్క ఎదిగే సమయంలో ఏదైనా సమస్య వస్తే ఈ కిట్లు అందించే సంస్థలు తమ కస్టమర్ కేర్ లో మాట్లాడే సదుపాయం కల్పిస్తారు వీటిని పెంచి, కానుకగా కూడా ఇవ్వచ్చు.

Leave a comment