ఏదన్న అనుకొన్న పని జరగకపోయినా కోరుకొన్న అవకాశం రాక పోయినా నేనెప్పుడూ అయ్యో అనుకోలేదు . ఎదురు చూస్తానంతే సమయం పడుతోంది అనిపించినా సరే,అది నా దగ్గరకు వచ్చినప్పుడే  సరైన సమయం అనుకొంటాను అంటోంది సాయి పల్లవి . ఏదైనా జరగాలి అనుకొంటే దాన్ని ఎవరు ఆపలేరు, ఫలితం కూడా అంతే ,ఎలాంటి ఫలితం వచ్చినా సక్సెస్ కానీ పెయిల్యూర్ అవనీ దాన్నించి ఒక కొత్త పాఠం నేర్చు కోవాలి . ఆ పాఠం నాకు నేర్పేందుకు అలా జరిగింది అనుకుంటాను . అందుకే నాకెప్పుడూ నిరాశ కలగదు . ప్రతికూల ఫలితం ఎదురైతే దాన్ని ఇంకోవైపు నుంచి అర్ధం చేసుకొని నేనోపాఠం నేర్చుకొన్నానను కొంటాను . ఎన్నాళ్ళు నటిస్తానో తెలియదు కానీ ఒక పాత్రలో ఒక కొత్త జీవితాన్ని ఆస్వాదించటం నాకిష్టం  అంటోంది సాయి పల్లవి .

Leave a comment