ఆరనీకుమా….ఈ దీపం కార్తీక దీపం!!

చెలులారా!! కార్తీక మాసం మనం తెల్లవారుఝామున లేచి కార్తీక దీపం తులసి కోట వద్ద వెలిగించి ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేసి,క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి నాడు భక్తగా రుద్రుడికి పూజలు చేసుకుని తరించాము.
ఈ రోజు కార్తీక మాస చివరి సోమవారం.సకల జనులను చల్లని చూపులతో తల్లి ఆశీస్సులు ప్రసాదించమని విశ్వేశ్వరుడ్ని వేడుకుందాము.అర్ధనారీశ్వరుల సేవ చేసుకునే భాగ్యం మరల కలిగించమని పూజలు చేసి ముక్తి పొందుదాం.
“అయ్య కడ ఐశ్వర్య మడిగి.. అమ్మ కడ సౌభాగ్యమడిగి..నెయ్యమున నీ చరణదాసుల కియ్యవా దేవాదిదేవ”!!

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,ప్రీతికరమైన అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment