రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ  ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో పల్చని గంజిలా చేసి అందులో పండ్లు చెర్రీ ముక్కలు వేసుకుని తాగచ్చు. హాల్ గ్రేయిన్ లేదా మల్టీ గ్రేయిన్ బ్రేడ్ తో శాండ్ విచ్ తయారుచేసుకుని తినాలి. పాన్ కేకులు చేయుకుంటే మైదా పిండి బదులు గోధుమపండి వాడాలి. చపాతీలను గోధుమపిండి తో మల్టీ గ్రేయిన్  ఆటా తో పప్పులపిండి కూరగాయలు  కలిపి తయారు చేసుకోవాలి . కూరగాయలు పండ్ల ముక్కలు కలిపి రుచికరమైన సలాడ్స్  చేసుకోవాలి. లంచ్ బాక్స్ లో పండ్లు ఉండాలి. సన్నగా తరిగిన కూరముక్కలను పండ్లను కలిపి లంచ్ బాక్స్ లో రెడీ చేసుకోవాలి . గోధుమపిండితో సెనగలు రాజ్మా చిక్కుడుగింజలు కలిపి చపాతీలు చేసుకోవాలి. క్యారెట్లు బాగా తురిమి గ్రేవీ గానో శాండ్ విచ్ గానో చేసుకోవాలి. కూరగాయల్ ముక్కలు బీన్స్ కలిపి ఈ శాండ్ విచ్ లో నింపాలి . పప్పు  ధాన్యాలు, గోధుమలు దంపుడు బియ్యం పండ్ల కూరగాయలు అన్నీ ఆహారంలో రోజూ వుండేలా  చూసుకోవాలి. ఉదయం తయారు చేసుకోగలిగే భీజనంలో వీటిల్లో కొన్నయినా ఉంటే రోజంతా నీరసం లేకుండా ఉంటుంది.

Leave a comment