Categories
మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఎర్ర కందిపప్పు తో ముఖం పైన ఉండే అవాంఛిత రోమాలు తేలికగా తొలగించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఈ కందిపప్పు తో తయారుచేసిన ప్యాక్ తో నల్ల మచ్చలు కూడా పోతాయి వందగ్రాముల ఎర్ర కందిపప్పు,గంధం పొడి 10 గ్రాములు బత్తాయి తొక్కు పాలు ఒక కప్పు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు, గంధంపొడి, బత్తాయి తొక్కలను పాలలో నానపెట్టాలి వీటన్నింటిని మిక్సీ లో వేసి మెత్తని ముద్దగా చేయాలి. ఈ పేస్ట్ ను క్రమం తప్పకుండా ముఖానికి రాసి ఆరిపోయాక కడిగేయాలి ఇలా రోజు రెండు వారాలపాటు చేస్తే మొహం పైన ఉండే అవాంఛిత రోమాలు పోతాయి.