మంచి పార్టీలకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు మెరిసే పర్సులు తీసుకుని వెళ్తూ వుంటారు. ఇప్పుడు కొత్తగా ఫింగర్ రింగ్ క్లచెస్ వచ్చాయి. ఈ పర్స్ గనుక చేతిలో పట్టుకుంటే చేతులకి ఉంగరాలు పెట్టుకునే పని లేదు. అచ్చం వేళ్ళకు ఉంగరాలు పెట్టుకునట్లే ఈ  క్లచెస్ వుంటాయి. ఒక ఉంగరం మొదలు నాలుగు ఉంగరాల వరకు వుండే ఈ క్లచెస్ లో రత్నాలు పొదిగినవి, బంగారం, ప్లాటినం ఉంగరాలు బ్యాగ్ కే కనక్టయి వుంటాయి. ఇలాంటి ఖరీదైన క్లచెస్తో పాటు పుర్రల్లాంటి ఫంకీ డిజైన్లు కూడా వున్నాయి అనుకోండి కానీ డ్రెస్ ని బట్టి అందమైన ఖరీదైన పర్సులు, దాని పైన వున్న వేళ్ళతో మార్చుకుంటే మెరిసి పోయే వజ్రాలు రత్నాలు వున్న ఈ ఉంగరాల పర్సులు మార్కెట్లో వున్నాయి.

Leave a comment