రుచికి, ఆరోగ్యానికి దివ్యంగా ఉపయోగపడుతుంది కనుక బొప్పాయిని దేవతల పండు అంటారు. కొలెస్ట్రాల్ ధమనుల్లో అట్టగట్టుకుపోకుండా నిరోధించటంలో ఈ పండు ఉపయోగపడుతుంది. పోషక విలువలు నిండుగా ఉంటాయి. కంటి చూపు కాపాడుతుంది. బొప్పాయి నుంచి వచ్చే పాలలో ఔషధ గుణాలున్నాయి. గృహ వైద్యంగా ఎన్నో రుగ్మతలకు పచ్చి బొప్పాయి పాలు ఉపయోగిస్తారు.పేగుల్లో నులి పురుగులు తగ్గించేందుకు పెద్దవాళ్ళు ,పిల్లలు ఈ బొప్పాయి పాలు తీసుకుంటారు.  నోటిలో పుండ్లు తగ్గించేందుకు కూడా బొప్పాయి పాలే ఔషధం. చర్మ వ్యాధులు చికిత్సలోనూ ఈ పాలు ఉపయోగ పడతాయి. బాగా పండని బొప్పాయి ముక్కలు డైట్ ఫుడ్ గా ఉపయోగపడతాయి.

Leave a comment