సాంప్రదాయ ఆభరణాలు కాలం తో నిమిత్తం లేకుండా తరతరాల వాళ్లు మెచ్చేలా ఉంటాయి. యాంటిక్ ఆభరణాలు అత్యంత అందమైనవీ,విలాసవంతమైనవీ కూడా ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు చాలా తేలికగా, బంగారం తో కలిపి ఆభరణాలుగా మలిస్తే అంతులేనంత అందంగా ఉంటాయి. సెలబ్రిటీ లు అనేక సందర్భాలలో స్టైల్ ని ముత్యాల ఆభరణాలతోనే మెరిపిస్తూ ఉంటారు. ఇక మొఘాలాయి కాలంనాటి జూడవ్ ఆభరణాలు ఎంతో ట్రెండీగా ఉంటాయి. ఇక చోకర్ నెక్లిస్ ల పనితనం అపూర్వం రాజస్థానీ మూలాలున్న మీనాకారి వర్క్ అత్యంత కళాత్మకం. ఇది ఎలాంటి వస్త్రధారణ అయినా చాలా బాగా నప్పుతాయి అలాగే నవరత్నాల ఆభరణాలు కూడా అత్యంత ప్రాచీనం, ఎంతో ఆధునిక కూడ కెంపు, పచ్చ, ముత్యం, పగడం, వజ్రం, వైడూర్యం, నీలం, పుష్పరాగం రాళ్లతో ఈ నవరత్నాలు నగలు ధరిస్తే అదృష్టం అంటారు. సూర్యుడు చుట్టు గ్రహాలకు ఈ నవ రత్నాల రాళ్లు సంకేతం అంటారు.ఈ తొమ్మిది రాళ్ళ ఉంగరం ఇప్పుడు ఫ్యాషన్ కూడా. ఈ ఆభరణాలు అందాన్ని ఇవ్వటమే కావు ధరించిన వ్యక్తుల మానసిక భావోద్వేగ స్థితిగతులను సమతుల్య పరుస్తాయి కూడా !
Categories