ఉదా చాలా అందమైన రంగు ఎప్పటికీ మార్పులేని ఫ్యాషన్ కలర్ కూడా. ఈ రంగు లోని లావణ్యాన్ని చుట్టు చూసి ఆనందించాలి అంటే దక్షిణ కొరియా లోని పర్పుల్ ఐలాండ్ కు వెళ్ళాలి. అక్కడ రోడ్లు, భవనాలు వాహనాలు అన్నీ ఉదా రంగులోనే ఉంటాయి. బాన్వోల్ పార్క్‌జీ అనే రెండు మామూలు ద్వీపాలను పర్యాటకుల కోసం ఇలా ప్రత్యేకంగా మార్చేసింది ఇక్కడి ప్రభుత్వం రెండు ఊర్లు కలిపే ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు. ఎరుపు లోని ఉత్తేజాన్ని నీలి వర్ణపు ప్రశాంతతను కలగలిపితే ఊదారంగు తయారవుతుంది ఈ రెండు రంగులు సమ్మేళనం తో ఉదా రంగు కళ్లకు మనకీ, ప్రశాంతతనిస్తుంది. సాయంత్రం వేళ, ఈ పర్పుల్ ఐలాండ్ వంతెనపై నడుస్తూ ఉంటే సముద్రం పై నుంచి వచ్చే చల్లగాలులు, చుట్టూ ఈ మైమరిపించే రంగులు వాతావరణం భూమి పైనే స్వర్గం అంటారు టూరిస్ట్ లు ఇక్కడ తోటల్లో కూడా ఉదా రంగు పూలనే పెంచుతారు. వచ్చిన పర్యాటకులు ఈ ద్వీపాల్లో విహరించేందుకు సైకిళ్లు అద్దెకు ఇస్తారట. ఈ దీవుల్లో కి పర్యాటకులకు ఇప్పుడు అనుమతి ఉంది. కరోనా సమయంలో కాస్త ఊపిరి పీల్చుకోవాలి అనుకుంటే ఈ ద్వీపాల సందర్శనకు వెళ్ళచ్చు .

Leave a comment