పరిణితి చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్రీన్ జ్యూస్ ఇప్పుడో పెద్ద సంచలనం అయిపోయింది. ఈ బాలీవుడ్ బ్యూటీ తన సౌందర్య రహస్యం ఇదే నంటూ బచ్చలికూర, బీట్ రూట్, ఆరెంజ్, పుదీనా తో చేసే గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చింది. ఆరోగ్యానికి మంచిదే చర్మ సౌందర్యానికి ఇదే బెస్ట్ అని ఆమె చెబుతున్న గ్రీన్ జ్యూస్ లో ఒక్కసారి మూడు బావుంటే నిమ్మరసం కూడా కలుపు కొంటాను అని చెబుతోంది.గత మార్చి నుంచి టర్కీ లో ఉంటున్న పరిణితి ది గర్ల్ ఆన్ ది ట్రైన్ సినిమా విజయం తో ఫుల్ హ్యాపీ అని చెపుతోంది. ఒక నటిగా నేను ఛాలెంజింగ్ గా ఉండాలనుకుంటాను అని చెప్తే పరిణితి ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలన్నీ సక్సెస్స్ ప్రతి సినిమా కోసం ఆమె ప్రత్యేకమైన హార్డ్ వర్క్ చేస్తూ వచ్చింది. డాన్స్ క్లాసులు, కలరియపట్టు అనే యుద్ధ క్రీడ నేర్చుకోవటం కఠినమైన డైట్ ప్లాన్ ఆమెను ఎప్పుడూ ముందువరుసలో ఉంచుతాయి అని చెబుతోంది. చాలా కష్టపడి తన జీవన శైలి మార్చుకున్న అని చెప్పే పరిణితి సినిమాల ఎంపికలో ఆచితూచి ఉంటానంటోంది. సైనా, సందీప్ ఔర్ పింకీ పరార్, ది గర్ల్ ఆన్ ది ట్రైన్ విజయాల వరుసలో ఈ సంవత్సరం అంతా తాజా చిత్రాలు చాలా ఉన్నాయి.

Leave a comment