ఏ వర్ష రుతువు లో ఎక్కడ లేని అందం తో విరబూస్తాయి రెయిన్ లిల్లీలు. పచ్చని ఆకుల మధ్య విచ్చుకునే వాన లిల్లీలు కాశ్మీర్ మంచులో లోయలోని కుంకుమ పూల తోటల్ని తలపుకు తెస్తాయి. ఎలాంటి నేలలో అయినా అందం కోసం పెంచుకో గలిగే పూలమొక్క జెఫి రాంథస్ రెయిన్ లిల్లీలు. ఉద్యానవనాల్లో పెరట్లో దారికి ఇరువైపులా వేస్తే పువ్వుల పండగ వచ్చినట్లే ఉంటుంది. నాలుగైదు రంగు దుంపల్ని ఒకే కుండీలో వేస్తే ఒకేసారి విచ్చుకొని పూల బొకే లాగా ఉంటాయి. ఇవి సాంప్రదాయ వైద్యంలోనూ బాగా ఉపయోగపడతాయి తెలుపు రంగులోని జెఫి రాంథస్ క్యాండీకా రకం ఆకులను మరిగించి ఆ నీళ్లను తాగితే నిద్రలేమి,కాలేయ వ్యాధులు తగ్గుతాయి. పిల్లలకు జ్వరం వస్తే ఈ పువ్వుల పేస్ట్ నీ నుదుటి పైన పట్టి లాగా వేస్తే జ్వరం తగ్గుతుంది. గులాబీ రంగులో విరిసే పూలను డయాబెటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ లాకీ వాడతారు. ఈ మొక్క దుంపలు ఒక్కసారి నాటితే ఎండకు ఆకులన్నీ ఎండిపోయి మొక్క కనిపించకుండా పోయినా వర్షాకాలం రాగానే పెరటి తోటలో పచ్చగా కనిపిస్తాయి . నీరు లేకున్న దుంప ఎండిపోకుండా వాన చినుకుల కోసం చూస్తుంది. కుండీల్లో నాటండి కాస్త చోట్లోనే చిన్న కారిడార్ లోనే సప్తవర్ణాల ఇంద్రధనస్సు వచ్చి వాలుతుంది .
Categories