Categories
స్కైప్ లో, ఫేస్ బుక్ జూమ్ ఆప్ ల ద్వారా ఈ మధ్యకాలంలో వీడియో కాన్ఫరెన్స్ లు ఎక్కువయ్యాయి. కరోనా తో వర్క్ ఫ్రమ్ హోమ్ లతో ఈ మీటింగ్స్ మరీ పెరిగిపోయాయి.స్నేహితులు, కుటుంబ సభ్యులతో జూమ్ లో మాట్లాడటం ఎక్కువే అవుతుంది. అయితే మీటింగ్స్ వల్ల చాలా బడలిక అనిపిస్తోందని చాలామంది కంప్లైంట్. ఎంత కాదనుకున్న, జూమ్ మీటింగ్ లలో ఉన్నప్పుడు అందులో సరిగ్గా కనబడుతున్నామా లేదా అన్న విషయంలో తెలియకుండానే ఎక్కువ ఫోకస్ పెడతామని స్క్రీన్ చూస్తూ జాగ్రత్తగా మాట్లాడటం వల్లనే ఆ ఒత్తిడి మెదడుపైనా పడుతూ బడలిక వస్తోంది అంటున్నారు ఎక్సపర్ట్స్.అంచేత మధ్యలో కెమెరా ఆఫ్ చేసి మాట్లాడుతూ ఉండండి ఈ సమస్య ఉండదు అంటున్నారు నిపుణులు.