Categories
మాస్క్ లతో మేకప్ ఎలా చేసుకోవాలి అనుకొంటారు కానీ సర్జికల్ మాస్క్ లు వాడితే మేకప్ పాడవదు అంటారు ఎక్సపర్ట్స్. తేలిక పాటి ఫౌండేషన్ కొద్దిగా పౌడర్ తో మేకప్ ఫినిష్ చేయవచ్చు. క్రీమ్ లిప్ స్టిక్ కాకుండా మ్యాటే లిప్ కలర్ వేసుకోవాలి. లిప్ స్టిక్ వేసే ముందల పెదవులకు మ్యాటే ఫౌండేషన్ రాయాలి. మాస్క్ వేసుకొనే ముందర టిష్యు తో పెదవులు అద్దాలి. లిప్ లైనర్ తప్పక వాడాలి లిప్ బామ్ రాస్తే పెదవులు తేమ ను కోల్పోకుండా ఉంటాయి. పొడవైన స్ట్రాప్స్ ఉన్న మాస్క్ లు పెట్టుకొంటే చెవి జుంకాలు పట్టేస్తాయన్న భయం ఉండదు.