ఆలయంలో ఒక్క దీపం అయినా వెలిగించాలని ఆశపడతారు. కానీ నా నృత్యాల వల్ల ఒక్క ఆలయానికైనా ప్రాచీన వైభవం వస్తే చాలు అంటుంది హిమాన్సీ కాట్రగడ్డ. ఈమె కూచిపూడి నృత్య కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయలు శిథిలా వస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి ‘టెంపుల్ డాన్స్’ పోస్ట్ చేస్తారు. ఒక్క తెలంగాణా లోనే వెయ్యికి పైగా శివాలయాలు ఉన్నాని అంతకుమించి శిల్పకళా ఉందని ఆ ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాని చూసి ఆశ్చర్యపోయాను. వాటిని రేపటి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను, నాట్య కళాకారులు ‘టెంపుల్ డాన్స్’ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాం ద్వారా జనంలోకి తీసుకువస్తున్నాం అంటుంది హిమాన్సీ కాట్రగడ్డ.

Leave a comment