Categories
టర్మరిక్ ఫేషియల్ టోనర్ ను ఇప్పుడు ఇంట్లోనే ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారు చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పసుపు కొమ్ము రసం, మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ నిమ్మరసం, గ్రీన్ టీ నాలుగు టేబుల్ స్పూన్లు కప్పు నీళ్లు తీసుకోవాలి. ముందుగా నీటిలో గ్రీన్ టీ వేసి బాగా మరగనివ్వాలి చల్లారిన ఆ నీళ్ళలో పసుపు కొమ్ము రసం, అలోవేరా, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్ లో ఉంచేయాలి. ఇది 15 రోజులు తాజాగా ఉంటుంది. ప్రతి రోజూ ముఖాన్ని ఈ ఫేషియల్ టోనర్ నీటితో మర్దన చేయాలి. తర్వాత వేడి నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు చర్మం బిగుతుగా అయిపోతుంది. మచ్చలు డార్క్ సర్కిల్స్ పోతాయి.