Categories
ప్రొటీన్లు పీచు ఎక్కువగా ఉండే ఓట్స్ తో లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఈ పోషకాలు ఉన్న ఓట్స్ ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉంటుంది. రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. వండే శ్రమ కూడా ఉండదు ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. ఇందులోని అత్యధిక పీచు కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దానితో శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లను సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది ఫలితంగా మధుమేహం దగ్గరకు రాదు.