వంటగది శుభ్రంగా ఉంటే ఇంట్లో అందరి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.వంట పూర్తయ్యాక వంటగది పూర్తిగా శుభ్రపరచాలి.స్టవ్ పైన మరకలు లేకుండా సబ్బు నీళ్ళతో శుభ్రంగా కడగాలి.నూనె జిడ్డు అంటుకున్న వంటింటి గోడలు ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా కడిగి వేయాలి. లేకపోతే అవి మొండి  మరకలు గా మారుతాయి. స్టవ్ తుడిచిన గుడ్డను వెంటనే వేడి నీళ్లతో ఉతికి ఎండలో ఆరవేయాలి.లేకపోతే దానికి అంటుకున్న జిడ్డు బ్యాక్టీరియా పోదు.స్టవ్ గట్టు వాటర్ క్లీనర్ తో నీరు లేకుండా తుడిచేయాలి.కిచెన్ ప్లాట్ ఫామ్ ఎప్పుడూ పొడిగా ఉండాలి.

Leave a comment