Categories
లక్ష్మీదేవిని క్షీర సముద్ర రాజ తనయ అని పిలుస్తారు. అంటే సముద్రాల లోకెల్లా గొప్పదైన పాల సముద్రం నుంచి జన్మించినది అని అర్థం అయితే పాలసముద్రం పెరుగు సముద్రం ఉంటాయా అంటే, ఉండవు, సముద్రం మన కళ్ళకు కనబడే తీరును బట్టి ఈ పేర్లతో పిలుస్తారు సూర్యకిరణాలు ఏటవాలు తనంతో సముద్రం పైన పడుతూ ఉంటే అక్కడి సముద్రం ఒక చోట తెల్లగా పాల వలె కనిపిస్తుంది దీన్నే క్షీర సముద్రం అన్నారు. ఇలా ఏడు తీరులుగా కనిపించే సముద్రాన్ని సప్త సముద్రాలుగా ఊహించి చెపుతారు.