శ్యామ వర్ణం తో ఉండే కృష్ణుడు అష్టమి నాడు జన్మించాడు. ప్రతి మాసంలో శుద్ధ పక్షం, కృష్ణ పక్షం అనే రెండు ఉంటాయి. పూర్ణిమ రాబోతున్న పదిహేను రోజుల్ని శుద్ధ లేక శుక్ల పక్షం అంటారు. అలాగే అమావాస్య రాబోతున్న15 రోజులను కృష్ణ, లేదా బహుళ పక్షం అంటారు. కృష్ణుడు ఈ రెండింటిలోనూ బహుళ పక్షాన్ని తాను పుట్టేందుకు అనువైనదిగా నిర్ణయించుకున్నాడు బహుళ పక్షంలో 8వ తిధి  అంటే అష్టమినాడు జన్మించారు. ఓ వ్యక్తి పూర్ణిమ వైపు ప్రయాణిస్తావా ? అంటే జ్ఞానం వైపుకా.. లేదా అమావాస్య వైపు అంటే అజ్ఞానం వైపుకా నిర్ణయించుకో అని చెప్పేందుకు కృష్ణుడు ఈ తిధి ని ఎంచుకున్నాడు. భగవంతుని ప్రతిచర్య లోనూ ఏదో పరమార్థం ఉండి తీరుతుంది.

Leave a comment