ఊరంటే మనుషులు సందడి కదా. కానీ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా మీనాక్షిపురం గ్రామంలో మాత్రం ఒకే ఒక్క మనిషి నివసిస్తూ ఉంటాడు అతనే 70 ఏళ్ల కందస్వామి నాయకర్. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ఆ వూరి జనాభా 1300. తర్వాత నుంచి ఒక్కళ్ళు గా ఆ ఊరు విడిచి వెళ్ళిపోయారు. దీనికి కారణం నీటి సమస్య రెండోది ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడక పంటలు పండవు భూగర్భ జలాలు ఎండిపోయి త్రాగునీరు కూడా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాలి. ఇక ప్రయాణం చేయాలంటే మైళ్లు నడిచి పక్క ఊరి బస్టాండ్ చేరుకుని అటు నుంచి వెళ్ళాలి. అందుకే ఈ ఊరు మీనాక్షి గ్రామాన్ని అందరూ వదిలేసి వెళ్లారు. ఒక కందస్వామి మటుకు నేను బతికి ఉన్నంత కాలం ఇక్కడే ఉంటానని ఉండిపోయాడు.

Leave a comment