ఏ వస్త్రశేణి అయినా ఏనుగులు ప్రింట్ ఫ్యాషన్ డిజైనర్ల ఎంపిక.రాజసంగా కనిపించే ఈ భారీ ఆకారం పట్టు,సిల్క్,కాటన్,ఏ వస్త్రం పై అయినా చాలా అందంగా కనిపిస్తుంది.లక్ష్మీదేవి వాహనంగా ఒక ఆద్యాత్మిక రూపంలో పట్టు చీరెల పైన ఏనుగుల ప్రింట్ చాలా అద్భుతంగా అమరిపోయి కనిపిస్తుంది.ఇక కలంకారీ లో అయితే ఈ ప్రింట్ కి తిరుగులేదు.అంచులుగా అయినా చీరె మొత్తం అయినా ఏనుగుల ప్రింట్ అందంగా ఉంటుంది.ఇక తెల్లని వస్త్రం పైన బ్లాక్ ప్రింట్ ఏనుగుకు తిరుగులేదు.అంబారీలో ఏనుగు రూపం సిల్క్,క్రేప్,సిఫాన్,జార్జెట్ వస్త్రాలకు కూడా ఎప్పటికి మారని ఫ్యాషన్.

Leave a comment