Categories
పర్యావరణ పరిరక్షణలో రీ సైక్లింగ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మహిళ దుస్తులు డిజైనర్ హెర్పెన్ వృధా ప్లాస్టిక్ సీసాలతో ఒక గౌను రూపొందించింది. బ్రిటిష్ ఫ్యాషన్ అవార్డుల కార్యక్రమంలో టెన్నిస్ క్రీడా దిగ్గజం మరియా షరపోవా రెడ్ కార్పెట్‌పై నడిచింది. 70 శాతం ప్లాస్టిక్ సీసాలు, 20 శాతం సిల్క్ ఫ్యాబ్రిక్ ను ఉపయోగించి వృధా సీసాలను పూరేకులు గా చేసి వాటిని గౌన్ కుట్టి దాన్ని త్రీడీ ప్రింట్ గా మార్చారు. ఈ గౌనుకు ‘మిమిసిస్’ అని పేరుపెట్టారు. దీని పై హ్యాండ్ వర్క్ కు 800 గంటలు మొత్తం గౌన్ తయారీకి సంవత్సరం పట్టింది. ప్రపంచానికి అతిపెద్ద సమస్య అవుతున్న ప్లాస్టిక్ ఫ్యాషన్ రంగంలో ఉపయోగించవచ్చు అనే అవగాహన కల్పించేందుకు ఈ డిజైనర్ గౌను రూపొందించానంటోంది హెర్పెన్.