Categories
ఒత్తిడి, రాపిడి తో నలుపు కు తిరిగిన మోకాళ్ళు, మోచేతులు మిగతా శరీర వర్ణం లో కలిసిపోయేలా చేయాలంటే కొన్ని ప్యాక్స్ ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే నలుపుదనం తగ్గుతుంది. బ్లీచ్ లాగా ఉపయోగపడే పాలు తేమ నందించే తేనె కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లో పంచదార కలిపి మోచేతులు మోకాళ్ళ పైన స్క్రబ్ చేయాలి. అలాగే నిమ్మరసం కూడా చక్కగా పనిచేస్తుంది.మరీ నలుపెక్కిన చర్మాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్లబరుస్తుంది. దీన్లో దూదిని ముంచి మోకాళ్లు మోచేతుల పైన 15 నిమిషాల పాటు రుద్దాలి రుద్దుతూ ఉన్నప్పుడే నలుపు మాయం అవడం కనిపిస్తూ ఉంటుంది. వారానికి ఒకరోజు ఇట్లా శుభ్రం చేస్తే మోచేతులు నలుపు పోతుంది.