Categories
చలి గాలులు ఎక్కువైనా ఈ వాతావరణంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.సూర్యకిరణాలు తగిలేలా కనీసం అరగంట సేపైనా ఆరు బయట ఏదో వ్యాయామం చేయాలి. ఆరుబయట వాకింగ్ కు వెళ్ళిన చలిగాలి తట్టుకునే విధంగా దుస్తులు ధరించాలి. ఈ చలి రోజుల్లో దాహం అనిపించకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. డిహైడ్రేషన్ సమస్య రాదు. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినటం సూపులు తాగడం చేయాలి. వాతావరణంలో తేమ తగ్గిపోయి చర్మం పొడిబారి పోకుండా కాళ్లు చేతులు పగుళ్లు రాకుండా కొబ్బరి బాదం నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి. నువ్వుల నూనె కూడా చర్మాన్ని తేమగా ఉంచుతుంది.