స్పిరు లీనా, సీ లెట్యూస్ ,ఐరిష్ మాస్,టోసాకా ఇవన్నీ సముద్రపు నాచు రకాలు ఇప్పుడివి అద్భుతమైన పోషకాహారంలో ఒకటిగా ఉన్నాయి. సూపర్ ఫుడ్ గా చెబుతూ నాసా శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో అందరికీ తెలిసింది. సాగర జలాల్లో మరెన్నో నాచు మొక్కలు పెరుగుతున్నాయి అవన్నీ పోషకాల నిధులనీ, అవన్నీ ఆహారంలో చేర్చుకుంటే రోగాలు లేకుండా నిండు నూరేళ్లు జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. చైనా, జపాన్, కొరియా, నార్వే వంటి దేశాల్లో ఈ సీవీడ్ లను పూర్వం నుంచి తింటూనే ఉన్నారు. నాచు మొక్కలు దాదాపు పచ్చగా ఉంటాయి. కొన్ని ఎరుపు, గోధుమ రంగులోనూ ఉన్నాయి. స్టార్ షెఫ్ లు వీటిని సలాడ్లు, సూపుల్లో ఇతరత్రా వంటల్లో వాడతారు. ఆరోగ్యకరమైన బయో యాక్టివ్ పదార్థాలు ఈ సీ వీడ్ లో ఎక్కువ. వాటిలోని అయోడిన్ థైరాయిడ్ గ్రంధి, పనితీరును పెంచుతుంది.
Categories