Categories
మహిళలు గర్భం దాల్చినప్పుడు, అంతకుముందు భారీగా ఉన్న, ఆమె స్థూలకాయం పిల్లల్లో అధిక బరువుకు స్థూలకాయాన్ని కి కారణం కాదని అంటున్నారు డాక్టర్లు. అమ్మల బరువు బి.ఎం.ఐ టీనేజ్ పిల్లల బరువు పై అంతగా ప్రభావం చూపదని అంతకు మించి వారు తినే ఆహారం వారి జీవన విధానం వల్లే అధిక బరువుతో ఉంటారని తేల్చారు డాక్టర్లు. సాధారణంగా తల్లి అధిక బరువుతో ఉంటే పిల్లలకు ఆ పోలిక వస్తుందని అంటారు కానీ అమ్మల బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్ పిల్లల శరీరాన్ని పెద్దగా ప్రభావితం చేయదు అంటున్నారు లండన్ పరిశోధకులు. సరైన జీవన శైలి, వ్యాయామం చేస్తే శరీరాన్ని ఎవరైనా అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు.