నందిత దాస్ తీసిన షార్ట్ ఫిలిం ‘ లిజన్  టు హర్ ‘ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది. ఏడు నిముషాల సినిమాలో నందిత దాస్ ఒక వర్కింగ్ ఉమెన్. లాక్ డౌన్ వల్ల ఇంట్లోంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లవాడు ఎదో అడుగుతుంటాడు. భర్త ఇంకో గదిలో వీడియో గేమ్స్ ఆడుతూ మధ్యలో కాఫీ అడుగుతుంటాడు. ఈ హడావుడిలో ఆమె వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉంటుంది. అంతలో ఒక ఫోన్ సఖి ఆర్గనైజేషన్ కోసం చేస్తే అది నందిత దాస్ కు వస్తుంది. ఉదయం సరుకుల కోసం వెళ్లి మూడు గంటలు క్యూ లో ఇరుకుపోయా అనీ,ఇంటికి వచ్చాక,భర్త తిడుతూ తంతూ ఉన్నారని తనను కాపాడమని ఫోన్, ఫోన్ అవతలి పక్క ఆమె తింటున్న తన్నులు తిట్లు వినబడుతూ ఉంటాయి. నందిత దాస్ ఫోన్ తీసుకొని పక్క గదిలోకి వెళ్తుండగా ఫిలిం ముగుస్తుంది. లాక్ డౌన్ లో మహిళల పట్ల గృహ హింస పెరిగి పోయిందని జాతీయ మహిళా కమిషన్ చెపుతోంది. ఆ నేపథ్యంలో సినిమా,గుసగుసలా అన్న ఎవరికన్నా చెప్పు,బయటికి చెప్పు ,నువ్వు హింస అనుభవిస్తూ ఉంటే ఎలాగోలా ‘ చెప్పు ‘ అని సందేశం ఇస్తోందీ షార్ట్ ఫిలిం. తప్పకుండా చుడండి.

Leave a comment