అందమైన జ్ఞాపకంగా దాచుకున్న పాతకాలపు చీరెలకు అందమైన కొత్త రూపం ఇస్తోంది రంగ్ రివాజ్ సంస్థ శారీ రిస్టోరేషన్ పేరుతో  పాత చీరెలకు కొత్త హంగులు చేరుస్తోంది. పాతకాలపు అపురూప వస్తువులు మెరుగుపరిచేందుకు 2015 లో ప్రారంభమైంది రంగ్ రివాజ్. గుర్ గావ్ లో ఉన్న ఈ సంస్థకు Rangriwaaz.com అనే పేరుతో వెబ్ సైట్ ఉంది. వీరిని సంప్రదిస్తే బనారస్ పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ వంటి ఖరీదైన అందమైన చీరెలను ఎక్కడైనా ఒక పోగు లేచిన పైట రంగు మారిన అంచు పాత గా అనిపించిన దాన్ని చక్కగా పోగులు అల్లి, జెర్రీ పోగులు చేర్చి కొత్తగా తయారు చేసి ఇస్తారు. ఈ ఆలోచన నచ్చి ఎంతో మంది పాత చీర తో కొత్త ట్రెండ్ తీసుకువస్తున్నారు.

Leave a comment