జార్జెట్ షిఫాన్ క్రేప్ వంటి తరహా చీరల పైకి ఇప్పుడు అద్దాల పనితనం సరికొత్త ట్రెండ్ అయింది. తక్కువ అద్దాలతో అవీ ప్లాస్టిక్ అద్దాలతో ప్రత్యేక డిజైన్ చేసిన చీరలు కొత్త అందాలతో మార్కెట్లో కూలువుతీరుతున్నాయి. ఇలాంటి చీరల పైకి బ్లవుజుకు మగ్గాం వర్కతో కలిపి అద్దాలు కుట్టించుకుంటే హెవీ లుక్ తో బావుంటాయి. ఇకత్ వస్త్రం పై అద్దాల వర్క్  అయితే క్రాప్ టాప్ కి జతగా నెట్టింగ్ లేహంగా కు చక్కని అద్దాలు మళ్ళి ఫ్యాషన్ అయిపోతుంది కనుక కాలేజీ వేడుకలకు అద్దాల ఎంబ్రాయిడరీ దుస్తులు ట్రయ్ చేయొచ్చు హైనెక్, బొట్ నెక్ , కోల్డ్ షాల్డర్ వంటి రకాల పైన అద్దాల పనితనం చాలా బావుంటుంది. పార్టీ వేర్ కోసం చక్కని పరికిణీ, ఒణిల పైన కూడా అద్దాలు కుట్టించుకోవచ్చు.

Leave a comment