శుభ్రత విషయంలో అతిగా మనస్సు పెట్టడం అనర్ధమే అంటున్నాయి అధ్యాయినాలు. అతి శుబ్రం కారణంగా పిల్లలు చిన్న చిన్న వ్యాధుల బారీన పడతారంటున్నారు. పెద్ద వారి శరీరంలో కోటానుకోట్ల సుక్ష్మ జీవులు సహజీవనం చేస్తుంటాయి. వాటిలో కొన్ని సుక్ష్మ జీవులు శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి కూడా ఇలాంటి సుక్ష్మ జీవులు చేతుల ద్వారానే శరీరం లోకి ప్రవేశించి వృద్ది చెందుతాయిట. పిల్లల చేతులు మురికిగా వున్నాయని తల్లులు పదే పదే శుబ్రం చేస్తుంటారు. అలా అస్తమానం శుబ్రం చేయడం వల్ల వాళ్ళకి మేలు చేసే సుక్ష్మ జీవులు కూడా చంపేస్తారన్నమాట. వాళ్ళ చేతులు సబ్బుతో లిక్విడ్ తోనూ కడగడం వల్ల మట్టి నుంచి లభించే మంచి సుక్ష్మ జీవులు పిల్లలు పోగొట్టు కోవలసి వస్తుందని, అందుకే పిల్లలు ఆటలా నుంచి రాగానే వాళ్ళ చేతులు వట్టి నీళ్ళతో కడిగితే చాలని సలహా ఇస్తున్నారు.
Categories