సెలవులు అయిపోయాయి. స్కూళ్ళు తెరిచారు. ఇక నిద్ర లేచీ లేవగానే వంటింట్లోకి పరుగు తీస్తుంటారు సహజంగా. కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెపుతున్నారంటే లేచీ లేవగానే పని లో దురిపోకుండా ఒక్క పది నిముషాలు ద్యానం కోసం, వ్యాయామం కోసమో సమయం కేటాయించ మంటున్నారు. బద్ధకం వదిలిపోవడమే కాదు. మెదడు రోజంతా చురుకుగా వుంటుంది. అలసట విసుగు వుండదు. పక్కాగా ప్రణాలిక లేకుండా పనులు మొదలు పెడితే మెదడు గందరగోళం అయిపోతుందంటున్నారు. రేపు చేయవలసిన పనుల లిస్టు ఈ రాత్రికి మనసు సిద్దం కావాలి. రేపు వందబోయే వంట, అందుకు కావాల్సిన సరుకులు, కూరలు సిద్దంగా వున్నాయా, ఉదయాన్నే లేవగానే ఏ పనులతో ప్రారంభిస్తే ఒక క్రమ పద్దతిగా పనులు అయ్యి పోతాయా మనస్సులోనే ప్రణాళిక సిద్దంగా వుండాలి. ఇలా వుంటే ఉద్యోగం చేసే గృహిణులకు కూడా ఆదుర్దా లేకుండా పని చేసే చోట ఉత్పాదకత పెరుగుతుందని  అధ్యాయినాలు చెప్పుతున్నాయి. అందుకే ఉదయం ప్రారంభించే పనిలో ఒక కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment