Categories
WhatsApp

వర్కవుట్స్ ముందర కొంచం తినొచ్చు.

జిమ్ కు వెళ్ళేటప్పుడు ఎదో ఒక్కటి తప్పని సరిగా తినాలి లేకుంటే అనారోగ్యం అనే అపూహా చాలా మందిలో వుంటుంది. అలా అని అసలు ఆహారం లేని పరిస్తితి లో వర్కవుట్స్ కూడా కష్టమే. లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఏ కండరాల వర్కింగ్ జరుగుతుందో వాటికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ విధంగా రక్త ప్రసరణలో జరిగే మార్పులు రెప్లెక్స్ కు నాంది పలుకుతాయి. ద్రవ రూపంలో ఆహారం తీసుకోవాలి. షేక్ లు త్వరగా జీర్ణం అవ్వుతాయి. తప్పనిసరిగా తినాలి అనుకుంటే వర్క్ అవుట్స్ మొదలు పెట్టేముందు గంటన్నర రెండు గంటల ముందే తినాలి. దీని వల్ల ఆహారం జీర్ణమై శరీరం పోషకాలు గ్రహిస్తుంది. అప్పుడు శరీరానికి చాలినంత శక్తి అందుతుంది. కనుక వర్క వుట్స్ సమయంలో నీరసం వుండదు. ప్రోటిన్లు, కార్బోహైడ్రేడ్స్, 20 నుంచి 40 గ్రాములుగా ఒక్కోటి వుండాలి. ఇలా లిప్టింగ్ కు ముందు వున్నాట్లయితే కండరాల బిల్డింగ్ కు సయం అవుతుంది. మజిల్ ప్రోటీన్లు బ్రేక్ డౌన్ కావు.

Leave a comment