Categories
Wahrevaa

పుష్కలమైన పోషకాలతో పొన్నగంటికూర.

పోయిన కంటి కూర తింటే కళ్ళు కనబడని వాళ్ళకి కంటి చూపు వస్తుందని తెలంగాణా పల్లెల వార్త. ఇదే వాడుకలో పొన్నుగంటి కూర అయింది. దీన్ని సంస్కృతంలో మత్యాక్షఅని ఇంగ్లీషులో డ్యార్ఫ్ కాపర్ లీఫ్ అని, సెసైల్ జాయ్ వీడ్ అని పిలుస్తారు. పూర్వం శక్తిని పుంజుకునెందుకు చేసే కాయకల్ప చికిత్సలో బంగారు భస్మానికి బదులు ఈ పొన్నగంటి కూర వాడేవారట. ఇందులో పోషకాలు ఎంతో ఎక్కువ. వందగ్రాముల ఆకులో 60 క్యాలరీలు, 12 గ్రాముల పిండి పదార్ధాలు, 4.7 గ్రాముల పోటిన్లు, 2.1 పీచు,146 మిల్లీ గ్రాముల కాల్షియం, 45 గ్రాముల పోటాషియం తో పాటు ఎ.సి విటమిన్లు వున్నాయి. వైరల్, బక్టిరియాల కారణంగా తలెత్తే జ్వరాలను నివారిస్తుంది. క్షయరోగాలకు ఇది అమృతాహారం లాంటిది. నరాలు, వెన్ను నొప్పికి అద్భుతంగా పని చేస్తుంది. జబ్బుల సంగతి ఎలా వున్నా పొన్నగంటి కూర ఆనందాన్ని పెంచే రుచికరమైన కూర.

Leave a comment