ముప్పయి ఏళ్ళు దాటాక ప్రతి మహిళా స్తన పరీక్ష చేసుకోవడం అలవాటు చేసుకోమంటున్నారు డాక్టర్స్ . సహజంగా సాధారణంగా ఉందా నిర్దారణ చేసుకోవాలి . నెమ్మదిగా రెండు స్థనాలను నొక్కుతూ మసాజ్ చేయాలి . ఏదో ఒక స్థనం ఆకృతి కాస్త పెద్దదిగా అనిపిస్తే ,స్థనాలు ఎర్రగా అయినా కాన్సర్ తొలి లక్షణాలుగా భావించాలి.స్థనాలు టెక్చర్ లో మార్పు వచ్చినా పరిగణ లోకి తీసుకోవాలి . నిపుల్స్ లోపలికి వెళ్లిపోయినట్లు కనిపించినా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి . నొక్కుతున్నపుడు ఏదైనా గట్టిగా చేతికి తగిలినా ,బిళ్ళలు కట్టినా నొప్పి అనిపించక పోయినా కాన్సర్ సూచనగా అనుకోవాలి . నిపుల్ లోంచి పాలు ,నీళ్ళు రంగు మారి వస్తున్నా సరే డాక్టర్ ను కలుసుకోవాలి రాష్, వాపు ,నొప్పి ఏదీ నిర్లక్ల్యం చేయవద్దు .

Leave a comment