ప్రకృతి వింతలకు అంతులేదు . ఎప్పుడు ఎదో ఒకటి మనిషిని ఆశ్చర్యం లో ముంచేస్తూనే ఉంటుంది . నీటిని నిల్వ చేసుకోగలిగే బాటిల్ ట్రీస్ ఆఫ్రికా మడగాస్కర్ ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి . ఈ చెట్టు పేరు బెయోబాబ్ . బంతి వంటి కాండంతో విశాలంగా పెరుగుతాయి . లోపల గది వంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది . లోపలకి వెళ్ళేందుకు గుమ్మా ల్లాంటి నిర్మాణాలు కూడా ఉంటుంది . ఒక్క చెట్టు తన కాండంలో 120,000 లీటర్ల నీటిని దాచగలుగుతుంది . ఆస్ట్రేలియాలో ఒక సమయంలో ఈ చెట్ల గదులను జైళ్ళు పోస్టపీస్ లో వినోదాల కోసం కూడా ఉపయోగించే వాళ్ళట . ఎంతో ఎత్తుగా ,వేలకొద్దీ సంవత్సరాలు జీవిస్తాయి ఈ చెట్లు . తెల్లని తీయని వాసనా వేసే పూలు పూస్తాయి . అవసర సమయంలో చెట్టు తనంతటతానే ఆకులన్నీ రాల్చేసుకోని నీళ్ళు ఖర్చు చేయకుండా ఉంటుందట .

Leave a comment