మాతే!! మలయధ్వజ పాండ్య సంజాతే…

మాతంగ వదనా!!  

హైదరాబాదులోని  దిల్షుఖ్ నగర్  కొత్తపేట లో అష్టలక్ష్మి అమ్మవార్లు ఒకే చోట కొలువై ఉన్నారు. ఈ దేవాలయం కంచి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్మించారు. ఇక్కడ ఆదిలక్ష్మి,అష్టైశ్వర్యలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి,విజయలక్ష్మి,ధైర్యలక్ష్మి,వరలక్ష్మి
భక్తులకు ఒకేచోట దర్శనం కలుగుతాయి.

ఆషాఢమాసం,శ్రావణమాసం,శరన్నవరాత్రులు
వైభవంగా జరుగుతాయి. నిత్యం పూజలతో అంగరంగ వైభవంగా అమ్మ వారు అలరారుతూ వుంటుంది.నిత్యం కుంకుమార్చనలు తో అమ్మ వారు కళకళలాడుతూ వుంటుంది.

ఇష్టమైన పూలు: చామంతి,సన్నజాజులు,విరజాజులు,సంపెంగలు.
ఇష్టమైన పూజలు: కుంకుమార్చన,గాజులు సమర్పించిన ఆనందం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,పులిహోర, పాయసం.

         
-తోలేటి వెంకట  శిరీష

Leave a comment