మట్టి పాత్రలు పర్యావరణ హితం. వీటిని శుభ్రపరచడం తేలిక ఖరీదు తక్కువ. వీటిలో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువే. వీటిలో వంట నెమ్మదిగా సాగుతుంది. మట్టిపాత్రలో ని సూక్ష్మమైన రంధ్రాల వల్ల వేడి తేమ పాత్రంతా వ్యాప్తి చెందుతూ పదార్థాన్ని ఉడికి స్థాయి. పదార్థాలు రసాయన చర్యలకు గురి కావు. ఆహార పదార్థాల లోని పోషకాలు, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్ వంటి ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి. పైగా నూనె చాలా తక్కువ అవసరం పడుతుంది. మట్టిపాత్రలో వండిన వంటలు అమోఘం అని ప్రపంచం అంతా నమ్ముతుంది. కరోనా అనంతరం ఆరోగ్య కారణాల రీత్యా మట్టిపాత్రలు మేలు అంటున్నారు  అందరూ ఈ ట్రెండ్ నగరాల్లో ఊపందుకొంది.

Leave a comment