Categories
1997 లో యూరప్ లో స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా లో రోడ్డు పక్కన ఉన్న శానిటరీ వర్కర్ కుమిల్ విగ్రహం అతని స్నేహితులు నిర్మించారు రోడ్డు పక్కన ఒక మ్యాన్ హోల్ లో నుంచి కొంచెం బయటికి వచ్చినట్లు కనిపించే ఈ విగ్రహం బ్రాటిస్లావా నగరానికి ప్రత్యేక ఆకర్షణ పర్యాటకులు దీని పక్కన కూర్చొని ఫోటోలు తీయించు కుంటారు కమిల్ ఒక అమ్మాయి తో ప్రేమలో పడ్డాడు. ఆమెను ఒక కాఫీ షాప్ కు ఆహ్వానించాడు మాటల్లో తనో శానిటరీ వర్కర్ ని అని చెప్పాడు. ఆ సాయంత్రం ఆమె కాఫీ షాప్ కు రాలేదు. ఏ పని అయినా గౌరవించే తన శానిటరీ వర్కరగా పని చేయడం ఆమెకు నచ్చకపోవడం వల్లే విడిపోయిందని కుమిల్ నివ్వెరపోయాడు. జీవితం పైన విరక్తి కలిగి చాలా త్వరలో అతను మరణించాడు అతని స్నేహితుడు అతనికి స్మృతి చిహ్నం నిర్వహించారు ఈ విగ్రహం పక్కనే ఒక కాఫీ కేఫ్ కూడా ఉంది.