ప్రతిరోజు ఉదయం చద్ది అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నా మంచిదే అంటున్నాయి అధ్యయనాలు. ఈ అన్నంలో పొటాషియం క్యాల్షియం, ఐరన్, విటమిన్లు పదిహేను రెట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. శరీరం ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది. రాత్రి వండిన అన్నంలో మునిగే వరకు నీళ్ళు పోసి తోడేసి ఉదయం అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం కరివేపాకు జీలకర్ర కలుపుకుని తింటే అనారోగ్య సమస్యలు రావు ఎముకలకు మంచి బలం ఇలా రోజు తింటే ఉత్తేజంగా శక్తి తో ఉంటారని చెబుతున్నారు. ఈ వేసవిలో ఈ చద్దన్నం బ్రేక్ ఫాస్ట్ ఎంతో మంచిది అంటున్నారు.

Leave a comment