మహిళల ప్రయాణం సౌలభ్యం కోసం తిరుపతి లో పింక్ ఆటోలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు స్వామి దర్శనం కోసమే కాకుండా ఆసుపత్రిలో చికిత్స కోసం విద్యాలయాల్లో చదువుకునే పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రతిరోజు చాలా ప్రాంతాల నుంచి తిరుపతి వస్తారు వారిలో ఒక్కళ్ళు గా ప్రయాణమై వచ్చే స్త్రీల భద్రత దృష్టిలో ఉంచుకుని పింక్ ఆటో సర్వీస్ లను ప్రారంభించాం అంటున్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు దాస్ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహకారంతో 350 మంది మహిళలు ఆటో డ్రైవింగ్ లో శిక్షణ పొందారు వారి లో 150 మందికి తిరుపతి లో ఆటో నడిపే అవకాశం వచ్చింది. ఏ సమయంలో అయినా ఈ ఆటో స్టాండ్ కి వెళ్ళవచ్చు అక్కడి మహిళా డ్రైవర్లు సురక్షితంగా గమ్యానికి చేరుస్తారు నగర బస్టాండ్, రొయ్య ఆస్పత్రి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో ఈ స్టాండ్ లు ఉంటాయి.

Leave a comment