మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలోని మారుమూల గ్రామం జలియన్ గ్లోంగ్ లో ఉన్న స్కూల్ కు మానింగ్‌సిలియు పమై అన్న పాప రెండేళ్ల లోపు వయసు తన తమ్ముడు తో పాటు వస్తుంది పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయంగా పిల్లవాడిని చూసుకోవలసి వస్తుంది. ఈ పాపకు నిద్ర పోతున్నా తమ్ముడిని వడిలో ఉంచుకుని పాఠం రాసుకుంటున్న మానింగ్‌సిలియు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మణిపూర్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి బిస్వజిత్ సింగ్ ట్విట్టర్ లో చదువు పట్ల పమై అంకిత భావం నన్ను ఎంతో కదిలించింది అని ప్రశంసలు కురిపించారు.పాప చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని ఇంఫాల్ లో పమై తల్లి తండ్రుల తో మాట్లాడారు. ఆ కుటుంబానికి అవసరమైన బియ్యం, పప్పులు వగైరాలు రాష్ట్రప్రభుత్వ చిల్డ్రన్ సర్వీస్ వారు అందించారు. నాగా స్టూడెంట్స్ యూనియన్ ఈ గ్రామాన్ని చూసి ఆర్థిక సాయం అందిస్తున్నారు పమై చదువు పట్ల ఉన్న ప్రేమ ఆ గ్రామాన్ని ప్రపంచ దృష్టికి తీసుకు వచ్చింది.
Categories