తోలుబొమ్మలాట కళ ను కాపాడే ప్రయత్నంలో స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని ఏర్పాటు చేశారు పద్మిని రంగరాజన్ సోషియాలజీ పరిశోధకురాలు గా అధ్యాపకురాలిగా పనిచేసిన పద్మిని ప్లాస్టిక్, కాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్ లతో దూది మొదలైన వ్యర్థాలతో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలతో మహాభారతం పురాణాలే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో చెపుతారు. తోలు బొమ్మలాట సరైన ప్రోత్సాహం లేక అంతరించి పోతున్న దశలో దాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా వర్క్ షాప్ లు నిర్వహిస్తారు. ఈ పప్పెట్ ఆర్ట్ లో గిరిజన విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తున్నారు.

Leave a comment