Categories
ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన బహుమతి-నోబెల్ బహుమతి 1901 నుంచి ఇప్పటి వరకు సాహిత్యానికి సంబందించి 16 మంది రచయిత్రులు ఈ బహుమతి అందుకున్నారు. సాహిత్యంలో నోబెల్ అందుకొన్న తొలి మహిళ సెల్మ లాగేర్లోఫ్ . స్వీడెన్ లో మార్బాకా నగరం 1858 లో పుట్టింది మూడేళ్ళ వయసులో పక్షపాతం రావటం తో తుంటి లోపంతోనే జీవించింది. సెల్మ బాల్యం అంతా నాయనమ్మ దగ్గరే గడిచింది. ఆమె చెప్పిన కధలు రేకెత్తించిన స్ఫూర్తి తో సాహిత్యం పట్ల ప్రేరణ కలిగింది. ఆమె రచనలు గోస్టా బెర్లింగ్స్ వీరగదా,క్రీస్తు విరోధ అద్భుతాలు క్రైస్తవ ప్రాచీన కధలు,స్వీడెన్ చరిత్ర-భూగోళ శాస్త్రం మొదలైనవి. బహుళ ప్రక్రియల్లో రచనలు చేసినందుకు గాను 1909 లో ఆమెకు నోబెల్ పురస్కారం లభించింది.