క్లౌడ్ టైలర్ పేరుతో ఆన్ లైన్ ద్వారా దర్జీ సేవలను మహిళల ఇళ్ల దగ్గరకు తెచ్చారు సుస్మిత లక్కాకుల. క్లౌడ్ టైలర్ యాప్ ఉంటే నచ్చిన డిజైన్లతో దుస్తులు కుట్టించు కోవచ్చు. ఈ క్లౌడ్ టైలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్లో ఫ్యాషన్ డిజైనర్  కన్సల్టేషన్ ఉంటుంది. శరీరాకృతికి తగిన ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ లు చూపెడతారు వాళ్ళు. వీడియో కాల్ ద్వారా కటింగ్ మాస్టర్ మన కొలతలు తీసుకుంటారు. నచ్చిన డిజైన్స్ యాప్ లో చూసుకుని ఎప్పటి లోగా దుస్తులు కావాలి అనుకుంటామో ఆ తేదీ రీసెట్ చేస్తే సరిపోతుంది. పిక్ ప్  నుంచి డెలివరీ వరకు క్లౌడ్ యాప్ లో చూసుకోవచ్చు. ఇందులో దుస్తులు స్టిచ్చింగ్ కోసం వాడే దారాలు హుక్స్ బటన్స్ కూడా నాణ్యత విషయంలో బాగుంటాయి. అన్ని విధాలా మహిళలకు సౌకర్యంగా ఉండే టైలరింగ్ వేదిక ఇది. సుస్మిత బిట్స్ పిలానీలో ఎం.ఎస్ చేశారు.

Leave a comment